ఆర్మూర్ పట్టణ పోలీస్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ఆరుగురికి సోమవారం జేఎఫ్సీఎం మెజిస్ట్రేట్ సరళరాణి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకొని, కౌన్సెలింగ్ అనంతరం కోర్టులో హాజరుపరిచినట్లు ఎన్హెచ్వో పి. సత్యనారాయణ తెలిపారు. కోర్టు తీర్పుతో మొత్తం రూ.60వేల జరిమానా వసూలైంది.