తెలంగాణ ప్రభుత్వ ఉపాధి మరియు శిక్షణ శాఖ, జిల్లా ఉపాధి కార్యాలయం నిజామాబాద్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM) సంయుక్తంగా 2026 జూలై 2వ తేదీ (గురువారం) ఉదయం 9 గంటలకు నిజామాబాద్‌లోని జనార్దన్ గార్డెన్స్, వర్ణి చౌరస్తా, నాగారం రోడ్‌లో విదేశీ ఉద్యోగ మేళా, భారీ జాబ్ మేళాను నిర్వహిస్తున్నాయి. ఈ విషయాన్ని జిల్లా ఉపాధి అధికారి విజేత వేల్పుల తెలిపారు.