డిచ్పల్లి మండలంలోని సెవెంత్ బెటాలియన్ ఆవరణలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సోమవారం గణపతి హోమం, అన్నదాన కార్యక్రమాన్ని కమాండెంట్ బి. సీతారాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ హోమంలో బెటాలియన్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, బెటాలియన్ అభివృద్ధి కోసం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సిబ్బంది, కుటుంబ సభ్యులు, భక్తులకు అన్నదానం చేశారు.