ధర్పల్లి మండల కేంద్రంలోని గాంధీ చౌక్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. నాయకులు, ప్రజాప్రతినిధులు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెలిమెల నరసయ్య మాట్లాడుతూ గాంధీ ఆశయాల సాధనకు పార్టీ కృషి చేస్తోందని తెలిపారు. మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతిని కూడా స్మరించుకుని, ఆయన 'జై జవాన్. జై కిసాన్' నినాదాన్ని దేశం మరువదని అన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు నేటి నుంచి వారం రోజుల పాటు 'సేవ్ డెమోక్రసీ' కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.