గోవిందుపల్లిలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు

ధర్పల్లి మండలంలోని గోవిందుపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన అహింస, సత్యాగ్రహం, శాంతి మార్గాలను స్మరించుకుంటూ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దొడ్డెనుక శ్రీనివాస్, వార్డు మెంబర్ రాజ శేఖర్ గౌడ్, వీడిసి చైర్మన్ కనకం రాజు, వైస్ చైర్మన్ కర్రోల్ల శ్రీకాంత్, రామారావు, శ్రీను, రాజేశ్వర్, ప్రశాంత్, గణేష్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕