గంగమ్మ తల్లి జాతర: బోనాలు, ఊరేగింపుతో ఘనంగా వేడుకలు

నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి గ్రామంలో గంగమ్మ తల్లి జాతర ఉత్సవాలు గత రెండు రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనాలు సమర్పించారు. మూడవ రోజు అమ్మవారి ఉత్సవ మూర్తిని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. మాజీ రైతు సమన్వయ శాఖ అధ్యక్షులు రాజు పాల్ రెడ్డి, హనుమంత్ రెడ్డి పల్లకిని మోసి, అమ్మవారిని నీటితో అభిషేకించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలు బాగుండాలని గంగపుత్ర సంఘం సభ్యులు తరతరాలుగా ఈ జాతరను నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్