మహిళా సంఘం భవనానికి భూమి పూజ: ఎమ్మెల్యేకు సర్పంచ్ కృతజ్ఞతలు

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని చల్లగర్గ గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి బుధవారం భూమి పూజ జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ గాదే నరేష్ మాట్లాడుతూ, గ్రామానికి మహిళా భవన్ మంజూరు చేసిన రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ భవనాలతో మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మగ్గిడి స్రవంతి ప్రసాద్, పాలక వర్గం సభ్యులు, మహిళా సంఘం అధ్యక్షురాలు ఇ.ముతెమ్మ, C C రమణ, గ్రామ పంచాయతీ కార్యదర్శి బి.దిలీప్, మహిళా సంఘం సభ్యులు, విడిసి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్