భార్యను హత్య చేసిన భర్తకు జీవితఖైదు

నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్, భార్యను గొడ్డలితో కొట్టి హత్య చేసిన భర్త జంగం రాజు గంగారాంకు జీవిత కారాగార శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. నాందేడ్ జిల్లా బిలోలి తాలూకాకు చెందిన రాజు, శివకళ దంపతులు నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల-బి గ్రామంలో కిరాయి ఇంట్లో ఉంటూ కూలి పనులు చేసుకునేవారు. రాజుకు మద్యం అలవాటు ఎక్కువగా ఉండటంతో, భార్య అతన్ని మాన్పించడానికి ప్రయత్నించింది. మద్యం మానేయలేదని భార్య శారీరక కలయికకు నిరాకరించడంతో, రాజు ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. 08 డిసెంబర్, 2024 రాత్రి, రాజు తన భార్యను గొడ్డలితో తలపై కొట్టి హత్య చేశాడు. ఈ నేరం కోర్టులో రుజువు కావడంతో శిక్ష విధించారు.

సంబంధిత పోస్ట్