భార్యపై హత్యయత్నం చేసిన భర్తకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష

నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం ఆర్గుల్ గ్రామానికి చెందిన గర్వే స్పందనపై హత్యాయత్నం చేసిన కేసులో ఆమె భర్త గర్వే ప్రదీప్ కు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధిస్తూ స్పెషల్ సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ మంగళవారం తీర్పు చెప్పారు. 29 అక్టోబర్, 2014న వివాహం చేసుకున్న ఈ దంపతులకు పదేళ్ల కూతురు, ఏడేళ్ల కుమారుడు ఉన్నారు. చీరలతో భార్యను గొంతు నులిమి హత్యాయత్నం చేసిన ఘటనపై ఈ తీర్పు వెలువడింది.

సంబంధిత పోస్ట్