ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ శాఖ ఎన్నికలు రేపు (ఆదివారం) బస్టాండ్ పక్కన గల హరి చరణ్ మార్వాడి పాఠశాలలో జరుగుతాయి. పోలింగ్ సమయం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగును. ఇందులో సభ్యత్వం నమోదు కలిగిన ఓటర్లు తమ భాధ్యతగా నిజాయితీగా పనిచేసేవారిని తమ ఓటు ద్వారా ఎన్నుకోవాలని ఎన్నికల నిర్వహణ కమిటి కోరుతోంది. ఓటు కలిగిన సభ్యులు గుర్తింపు కోసం "ఆధార్ కార్డు"ను ఖచ్చితంగా వెంట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు.