మోపాల్ మండల శివారులో చిరుత సంచారం కలకలం

మోపాల్ మండల శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. దీంతో రాత్రి వేళలో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మోతీరాం నాయక్ తండా నుంచి కాల్పోల్ వెళ్లేదారిలో కొందరికి చిరుత కనిపించింది. శనివారం ఉదయం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు చిరుత ఆనవాళ్లు తెలుసుకునేందుకు మోపాల్ గ్రామాన్ని సందర్శించారు. ఒంటరిగా రాత్రి వేళలో బయటకు రావద్దని అటవీ ప్రాంతం వైపు వెళ్లవద్దని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕