జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు లిటిల్ హార్ట్స్ విద్యార్థుల ఎంపిక

నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలోని సిర్నాపల్లి జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో బుధవారం నిర్వహించిన ఎస్‌జీఎఫ్ జోనల్ స్థాయి కబడ్డీ ఎంపిక పోటీల్లో లిటిల్ హార్ట్స్ పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. అండర్-17 విభాగంలో ఎస్‌కే గౌస్, జి. వేదాంత్, అండర్-14 విభాగంలో ఎం. గణేష్, బి. శ్రీ వర్ధన్, బి. ప్రణవ్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అలాగే వాలీబాల్ క్రీడలో ఎం. గణేష్ ఎంపికయ్యాడు. విజేత విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ బి. ఏ. శ్రీకాంత్ ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్

✕
✕