ధర్పల్లి మండలం సిర్నాపల్లి జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో సోమవారం నిర్వహించిన ఎస్‌జీఎఫ్ జోనల్ స్థాయి కబడ్డీ ఎంపిక పోటీల్లో లిటిల్ హార్ట్స్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్-17 విభాగంలో ఎస్‌కే గౌస్, జి. వేదాంత్, అండర్-14 విభాగంలో ఎం. గణేష్, బి. శ్రీ వర్ధన్, బి. ప్రణవ్ ఎంపికయ్యారు. వాలీబాల్‌లో ఎం. గణేష్ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బి. ఏ. శ్రీకాంత్ విద్యార్థులను అభినందించారు.