*పాత్రికేయ రంగంలో చిరస్మరణీయుడు మల్లెపూల నరేంద్ర*

నిజామాబాద్: శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్‌లో స్వర్గీయ జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్ర 35వ వర్ధంతి స్మారక క్రీడల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ డి. సాయిలు మాట్లాడుతూ, నరేంద్ర నిజామాబాద్ గ్రామీణ విలేకరిగా అనేక గ్రామీణ సమస్యలను వెలికితీశారని, సాంకేతిక సౌకర్యాలు లేకపోయినా బైక్‌పై హైదరాబాద్ వెళ్లి వార్తలు అందించేవారని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి ఖో-ఖో పోటీలను ప్రోత్సహించారని, విధి నిర్వహణలో ఆయన ఆకస్మిక మృతి బాధాకరమని అన్నారు.

సంబంధిత పోస్ట్