నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. నడిమితండాకు చెందిన ధరావత్ దేవిసింగ్ ఆదివారం పొలానికి వెళ్లగా, ఉరుములతో కూడిన వర్షంలో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.