మారుతి మందిరం దుకాణం లీజు వేలం వాయిదా

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ మారుతి మందిరము దుకాణముల సముదాయంలోని షట్టర్ నంబర్ 1 కి రెండు సంవత్సరాల కాలానికి లీజ్ లైసెన్స్ వేలంపాట మంగళవారం రోజున నిర్వహించగా, వేలంపాట దారులు ఎవరు రానందున వేలంపాటను వాయిదా వేసినట్లు ఈఓ రాములు తెలిపారు. తదుపరి వేలంపాట తేదీని ప్రకటించగలమని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, చైర్మన్ గుండేటి శంకర్, రాజు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్