హైదరాబాదులోని హౌసింగ్ కార్పొరేషన్ లో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఇందిరమ్మ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ఉమ్మడి జిల్లా సమీక్ష నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తూ, నాగారం, కొత్త కలెక్టరేట్ వద్ద ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని కోరారు. ఇప్పటికే పూర్తయిన ఇళ్లు మరమ్మతులకు గురవుతున్నాయని, గతంలో చోరీకి గురైన వస్తువుల మరమ్మతులు చేసినా ఇళ్లు కేటాయించలేదని తెలిపారు.