గవర్నర్ ను కలిసిన ఎంపీ అరవింద్

తెలంగాణ రాష్ట్ర గవర్నర్​ శివ్​ప్రతాప్​ శుక్లాను ఎంపీ ధర్మపురి అర్వింద్​ గురువారం హైదరాబాద్​లోని లోక్​భవన్​లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ను ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులైన శివ్​ప్రతాప్​ శుక్లాను సాదరంగా స్వాగతం పలికామని, ఆయన విశేష పరిపాలనా అనుభవం, చారిత్రక సమకాలీన అంశాలపై ఉన్న లోతైన అవగాహన ద్వారా తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నామని ఎంపీ అర్వింద్​ తెలిపారు.

సంబంధిత పోస్ట్