నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండలంలో ఎంపీడీఓ బి. మారుతి, సీతాయిపేట, వాడి గ్రామాల్లో పింఛన్ దరఖాస్తుదారుల ధృవీకరణ ప్రక్రియను శుక్రవారం పరిశీలించారు. సీతాయిపేట గ్రామపంచాయతీలో దరఖాస్తుల వివరాలను తనిఖీ చేసి, వాడి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల రికార్డులు, మధ్యాహ్న భోజనాన్ని సర్పంచ్‌తో కలిసి ఆయన పరిశీలించారు.