మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తప్పనిసరిగా నోడ్యూ సర్టిఫికెట్ పొందాలి. ఆస్తిపన్ను పూర్తిగా చెల్లించినట్లు ఈ ధ్రువపత్రం ఉంటుంది. అయితే, ఒక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక అభ్యర్థి ఏకంగా రూ. 7.42 కోట్లకు పైగా మున్సిపల్ పన్ను బకాయిలు చెల్లించి, అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సంఘటన ప్రస్తుతం నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.