నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల మున్సిపాలిటీల్లో జరగనున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి కూడా పలువురు టికెట్ల కోసం ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు పార్టీ ముఖ్య నాయకులకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.