ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం మే నెలలోనే ఫీజుల నియంత్రణపై జీవో విడుదల చేయాలని టీఆర్ఎస్ అధినేత్రి కవిత డిమాండ్ చేశారు. నాణ్యమైన విద్య-ఫీజుల నియంత్రణపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అడ్డగోలుగా ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులపై మోయలేని భారం వేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలను కట్టడి చేయాలని కోరారు.