నిజామాబాద్: నేడు.. రేపు భారీ వర్షాలు

రాష్ట్రంలో బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ రంగు, మిగిలిన జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించారు. రేపటిలోగా కేరళ, తమిళనాడులను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశాలున్నాయి. మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా ఏన్కూరులో 7.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

సంబంధిత పోస్ట్