నిజామాబాద్: వెల్ నెస్ సెంటర్ కు చికిత్స చేయాలని వినతి

నిజామాబాద్ లోని వెల్ నెస్ సెంటర్ కు చికిత్స చేయాలని ఆల్ పెన్షనర్స్ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఈహెచ్ఎస్ వెల్ నెస్ సెంటర్ కు అదనపు గదులు కేటాయించి అన్ని సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ ను కలిసిన వారిలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్