నిజామాబాద్: గుర్తు తెలియని మహిళ మృతి

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి (GGH)లో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు NZB వన్ టౌన్ SHO బి. రఘుపతి శనివారం తెలిపారు. ఈ నెల 10న GGHలో OP కోసం వచ్చిన వృద్ధురాలు కింద పడి ఉండగా, సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ఎమర్జెన్సీ వార్డులో చూపించారు. అక్కడి వైద్యులు ఆమెను అడ్మిట్ చేసి చికిత్స అందించగా, చికిత్స పొందుతూ ఆమె శనివారం ఉదయం మృతి చెందింది.

సంబంధిత పోస్ట్