నిజామాబాద్: రోడ్డు పక్కనే మహిళ దారుణ హత్య?

నవీపేట్ మండల పరిధిలోని ఫకీరాబాద్ శివారులో శనివారం ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. బాసర ప్రధాన రహదారి పక్కన గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహం తల, కుడి చేతి వేళ్లు నరికి, వివస్త్రగా ఉన్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న నవీపేట్ ఎస్సై తిరుపతి, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో నిజామాబాద్ సీపీ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన తీరు, ఆ ప్రాంతాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్