ఈ నామ్ 2. 0 లో ఉన్న సాంకేతిక ఇబ్బందులు పరిష్కరించండి*

నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో ఈనామ్ 2.0 ద్వారా కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై ఎంపీ అర్వింద్ ధర్మపురి స్పందించారు. బుధవారం మార్కెట్ కమిటీ చైర్మన్, అధికారులతో సమావేశమై సమస్యలను తెలుసుకున్నారు. ఈనామ్ 2.0 లో రైతులకు లాట్ ఐడీలు జారీ చేయడంలో, మొబైల్ నెంబర్ల ఎంట్రీ వంటి కారణాలతో ప్రక్రియ ఆలస్యమవుతోందని వివరించారు. ఎంపీ అర్వింద్ ఢిల్లీలోని ఈనామ్ జాయింట్ సెక్రటరీ చిన్మయి గోత్మారేతో చరవాణిలో మాట్లాడి, సాంకేతిక ఇబ్బందులను సత్వరమే పరిష్కరించాలని, ప్రస్తుత సీజన్ ముగిసే వరకు ఈనామ్ 1.0 ద్వారానే కొనుగోళ్లు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్