నిజామాబాద్: స్నూకర్ అడ్డాపై దాడి చేసిన పోలీసులు

నిజామాబాద్ లోని స్నూకర్ అడ్డా మీద సీసీఎస్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాడి చేశారు. ఇక్కడ కొంత కాలంగా బెట్టింగ్ దందా సాగిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆదివారం సమాచారం రావడంతో సీసీఎస్ రంగంలోకి దించారు. సీసీఎస్ సీఐ వెళ్లారు. మూడో అంతస్థులో ఈ అడ్డా ఉంది. పోలీసు రాకను గమనించిన నిర్వాహకులు చాల సేపు దాక షెటర్ తెరవలేదు. ఈలోపు వెనుక నుంచి కిటికీ ద్వార బెట్టింగ్ తో స్నూకర్ ఆడుతున్న వారంతా పారిపోయారు. ఐదుగురు మాత్రమే పోలీసులకు చిక్కారు. వారి నుంచి రూ. 5వేల నగదు స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్