శ్రీరామ నవమి సందర్భంగా నగరంలోని హమాల్వాడి సంతోషి మాత (సాయిబాబా) ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం శోభాయాత్ర నిర్వహించారు. అయితే, అనుమతి లేదని పోలీసులు డీజే వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా పోలీసులతో మాట్లాడినా ఫలితం లేకపోవడంతో, స్వయంగా డీజే వాహనాన్ని నడిపి శోభాయాత్రను ముందుకు నడిపించారు.