పోలియో చుక్కలు వేయాలి: డాక్టర్ అరవింద్

నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి, సితాయిపేట్ గ్రామాలలో ఆదివారం పోలియో దినోత్సవం సందర్భంగా డాక్టర్ అరవింద్, ప్రణవి, గ్రామ సర్పంచ్ సిహెచ్ భూమేష్ పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని డాక్టర్ అరవింద్ సూచించారు. సోమ, మంగళ, బుధవారాల్లో ఆశ వర్కర్లు ఇంటింటికి తిరిగి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని, కావున అందరూ తప్పనిసరిగా పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్