నిజామాబాద్ నగరంలోని పూలాంట్ ఫీడర్ లైన్ చెట్ల కొమ్మలను తొలగించడానికి శనివారం ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని నిజామాబాద్ టౌన్ ఏడీఈ ఆర్. చంద్ర శేఖర్ తెలిపారు. రాణా టవర్, అభ్యాస స్కూల్ ఏరియా, ఇందూరు, వినాయక, ఆకాష్ అపార్టమెంట్, శివాలయం మందిర ఏరియా, కాకతీయ స్కూల్, దేవి టాకిస్, పూలాంగ్, వేణుమాల్, నిఖిల్ సాయి, వంశీ హోటల్ రోడ్, రైతు బజార్ ఏరియాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.