నిజామాబాద్ నగరంలోని 11 కేవీ లలితామహాల్ విద్యుత్ లైన్లో మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 11 నుంచి 12. 30 గంటల. వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడు తుందని ఏడీఈ టౌన్-2 ఆర్ ప్రసాదొడ్డి బుధ వారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రద్ధానంద్ గంజ్, ప్రభాత్ టాకీస్, హమాల్వాడి, నాందేవ్వాడ పరి సర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుం దన్నారు: అలాగే సాయంత్రం 4 నుంచి 5. 30 గం టల వరకు తీన్ కమాన్, నిజాంకాలనీ, తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ప్రసాదొడ్డి కోరారు.