సిపిఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత ఆధ్వర్యంలో నాగారం గోశాల వద్ద పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ఆటోలకు తాళ్లు కట్టి వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని, ఆటో నడుపుకునేవారు, కూరగాయలు, పండ్లు అమ్మేవారు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ధరల పెరుగుదల వల్ల అసంఘటిత కార్మికులు, సామాన్య ప్రజలపై భారం పడుతోందని ఆమె అన్నారు.