పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసన

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (RSP) ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా ఆటోను తాడుతో కట్టి లాగుతూ వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచుతూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని, నిత్యావసరాల ధరలు ఇప్పటికే అధికంగా ఉండగా, ఇంధన ధరల పెంపు రవాణా రంగాన్ని దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్