కోటగిరి, పోతాంగల్ మండలాల్లోని గ్రామ పంచాయతీలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక అధికారులతో గ్రామ సభలు నిర్వహించారు. కోటగిరి మండల కేంద్రంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ బర్ల మధుకర్ అధ్యక్షతన జరిగిన సభలో, 99 రోజుల ప్రణాళికలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఆరోగ్య సిబ్బంది నూతన హెల్త్ సబ్ సెంటర్ల ఆవశ్యకతను సభ దృష్టికి తీసుకెళ్లారు.