క్రమం తప్పకుండా చిన్నారులకు, గర్భిణీలకు పౌష్టిహారం

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణీలకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. పౌష్టికాహార పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని, ఈ యాప్ ద్వారా పర్యవేక్షణ జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్