ప్రజావాణి కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఏప్రిల్, మే నెలల వేతనాలు ఇంకా చెల్లించకపోవడంతో అంగన్వాడీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆశా వర్కర్లకు పనిభారం పెరిగి, అధికారుల వేధింపులు అధికమవుతున్నాయని, వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లతో వెట్టి చాకిరీ చేయిస్తోందని ఆరోపించారు.