బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. వ్యక్తి మృతి

నందిపేట మండలం కుదువాన్పూర్ గ్రామానికి చెందిన బ్యాగరి పోశెట్టి (29) తన తల్లితో కలిసి ద్విచక్ర వాహనంపై నందిపేట వెళ్తుండగా, జోరుపూర్ గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో అతని తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, గాయపడిన తల్లిని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్