ధర్పల్లిలో పల్స్ పోలియో చుక్కలు వేసిన సర్పంచ్ శ్రీనివాస్

ధర్పల్లి మండల వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. జూన్ 29 నుంచి ఇంటింటికీ వెళ్లి మిగిలిన పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి, గతంలో పోలియో టీకాలు వేసినా కూడా ఈ రెండు చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్, వార్డ్ మెంబర్స్, రాజు, ప్రశాంత్, రెబ్బ శ్రావణ్, హమీద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్