నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవనంలో బీసీ టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న 90 మంది ఉద్యోగులను అవార్డులతో సన్మానించారు. మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్. భూపతి రెడ్డి, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాదుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి బీసీ టీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్ కుమార్ అధ్యక్షత వహించారు.