నిజామాబాద్ జిల్లా ధర్పల్లి గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతంలో చేయూత పింఛన్ల దరఖాస్తులపై అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. అర్హతలను పరిశీలించి వివరాలను నమోదు చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం అందేలా ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.