17 లక్షల విలువచేసే సెకండ్ హ్యాండ్ ఫోన్ రికవరీ

నిజామాబాద్​ డివిజన్​ పరిధిలో పోగొట్టుకున్న, చోరీకి గురైన రూ. 17 లక్షల విలువైన 170 సెల్​ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సెల్​ఫోన్ రికవరీ మేళాలో ఏసీపీ రాజా వెంకట్​ రెడ్డి ఈ ఫోన్లను బాధితులకు అప్పగించారు. విలువైన సమాచారం ఉన్న ఫోన్లతో అజాగ్రత్తగా ఉండవద్దని, పోగొట్టుకున్నా లేదా చోరీ జరిగినా వెంటనే సీఈఐఆర్​ పోర్టల్​లో లేదా సమీప పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్