లాటరీ విధానం ద్వారా డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారుల ఎంపిక

కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ పథకం కింద మంజూరు చేసిన ఇళ్లను లబ్ధిదారులు వేగంగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన ఈ సమీక్షలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు వంటి అంశాలపై కూడా చర్చించారు.

సంబంధిత పోస్ట్