కేసీఆర్ పై అపవాద చేయడం అంటే ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీయడమే

తెలంగాణ లీగల్ సెల్ కన్వీనర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ, కేసీఆర్‌ను తాకడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకడమేనని అన్నారు. స్వరాష్ట్రాన్ని సాధించి, తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని, ఆయనపై బురద చల్లడం సూర్యునిపై ఉమ్మి వేయడమేనని పేర్కొన్నారు. పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు, సింగరేణి కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ నోటీసుల పేరుతో రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని, ఇది రేవంత్ రెడ్డి చౌకబారు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. అధికారం, అహంకారం శాశ్వతం కాదని, తెలంగాణ మొత్తం కేసీఆర్ వెంటే ఉందని, ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు.

సంబంధిత పోస్ట్