నిజామాబాద్: ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్ దంపతులు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ నీలకంఠేశ్వరాలయంలో గురువారం కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకము, హారతి వంటి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు కలెక్టర్ దంపతులను శేషవస్త్రముతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ చైర్మన్ సిరిగిరి తిరుపతి, సభ్యులు, అర్చక సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్