ధర్పల్లి మండలంలోని దమ్మన్నపేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన గుండ్ల మోహన్ తొలిసారి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దమ్మన్నపేట్ గ్రామంలో సీసీ రోడ్డు పనుల కోసం ఎస్‌డీఎఫ్ నిధుల నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డీసీసీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, ధర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు గాదె నరేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దినాకర్, సర్పంచ్ వసంత రమేష్, గుండ్ల మోహన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.