గుడి తండాలో ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు

ధర్పల్లి మండలం గుడి తండాలో ప్లాస్టిక్ నిర్మూలనకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. శనివారం గణేష్ మండపాల వద్ద ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు వినియోగించకుండా స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు ఉపయోగించే కార్యక్రమాన్ని ఎంపీడీవో బి. మారుతి ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ మలావత్ సరస్వతి రమేష్, ఉపసర్పంచ్ మోహన్ నాయక్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕