ఫీజు రీబర్స్మెంట్ పై విద్యార్థి సంఘాల ఆందోళన

ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలంటూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన కళాశాల బంద్ విజయవంతంగా జరిగింది. జిల్లా బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవాతే ప్రతాప్ సారథ్యంలో నగరంలో కళాశాలలకు వెళ్లి తరగతులను బహిష్కరించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ 8వేల కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని నవాతే ప్రతాప్ అన్నారు.

సంబంధిత పోస్ట్