ప్రస్తుత కాలంలో పెరుగుతున్న వాహన రద్దీ దృష్ట్యా ప్రతి ఒక్కరూ రహదారి భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆర్టీవో ఉమామహేశ్వర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని ఐటీఐ కళాశాల, నలంద ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రహదారి భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రహదారి నిబంధనల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్లే అధిక శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనం నడిపే సమయంలో హెల్మెట్, సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని గుర్తుచేశారు. ఏఎంవీఐ వాసుకి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.