నిజామాబాద్ నగరంలో బుధవారం పీడీఎస్‌యూ నగర కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థి అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్‌ను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చంద్రశేఖర్ చౌరస్తా నుండి సుభాష్ నగర్ తెలంగాణ తల్లి విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో జిల్లా అధ్యక్షులు కర్క గణేష్, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఆయన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ గ్రామ వాసి కావడం జిల్లా విద్యార్థులకు గర్వకారణమన్నారు.